News November 18, 2024
అనంత: ప్రేమ వివాహం.. భర్తను చంపిన భార్య
కళ్యాణదుర్గం మండలం PTR పల్లి తండాలో ఆదివారం రాత్రి భర్తను భార్య హత్య చేసింది. పోలీసుల వివరాల మేరకు.. తండాకు చెందిన గీతాబాయి, ప.బెంగాల్‌కు చెందిన విజయ సర్దార్ బెంగళూరులో ప్రేమించుకుని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. భార్యను అనుమానిస్తూ వేధిస్తుండటంతో సొంత గ్రామానికి వచ్చింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన భర్త మళ్లీ గొడవ పడటంతో మద్యం తాగి పడుకున్న సమయంలో తాడుతో గొంతుకు బిగించి చంపివేసిందన్నారు.
Similar News
News December 7, 2024
ATP: 30 మంది ఏఎస్సైలు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ
అనంతపురం జిల్లాలో 30 మంది ఏఎస్సైలు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ చేశారు. శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో వారికి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి బదిలీ చేశారు. ఒకే పోలీసు స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. బదిలీల ప్రక్రియకు కొలమానమైన నిబంధనలను సిబ్బందికి ఎస్పీ వివరించారు.
News December 7, 2024
ATP: 30 మంది ఏఎస్సైలు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ
అనంతపురంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో 30 మంది ఏఎస్సైలు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్లకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి బదిలీ చేశారు. ఒకే పోలీసు స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. బదిలీల ప్రక్రియకు కొలమానమైన నిబంధనలను సిబ్బందికి ఎస్పీ వివరించారు.
News December 7, 2024
గతంలో చెత్త మీదా పన్ను వేశారు: మంత్రి సవిత
పెనుకొండలో శుక్రవారం చెత్తలో నుంచి ప్లాస్టిక్ వస్తువులను ‘రీ సైక్లింగ్’ చేసే స్క్రీనింగ్ వాహనాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చెత్త మీద కూడా పన్ను వేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని విమర్శించారు. పట్టణ ప్రజలు చెత్తను మున్సిపల్ వాహనాల్లోనే వేయాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.