News April 16, 2025

అనంత: బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జికి సన్మానం

image

బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి జస్టిస్ జి.శ్రీనివాస్‌ను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ మంగళవారం సన్మానించారు. అనంతరం జడ్జికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. జిల్లా జడ్జిగా ఉత్తమ సేవలు అందించారని.. జిల్లా పోలీసుశాఖ, జిల్లా న్యాయశాఖలు పరస్పర సహకారంతో ముందుకెళ్లి బాధితులకు న్యాయం, నిందితులకు శిక్షలు పడటాన్ని గుర్తు చేసుకున్నారు.

Similar News

News April 24, 2025

స్వచ్ఛతలో అనంతపురం జిల్లాకు అవార్డు

image

స్వచ్ఛ ఆంధ్ర అమలులో అనంతపురం జిల్లాకు అవార్డు దక్కింది. రాష్ట్రంలోనే తొలి స్థానంలో అనంతపురం, ద్వితీయ స్థానంలో సత్యసాయి జిల్లా నిలిచాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. నేడు విజయవాడలో జరగనున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అవార్డును అందుకోనున్నారు.

News April 24, 2025

ఈతకు వెళ్లి బీఫార్మసీ విద్యార్థి మృతి

image

నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్న అనంతపురం యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన అంజి నార్త్ రాజుపాలెంలోని వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సమీపంలోని రేగడిచిలక వద్ద బావి దగ్గరికి ఐదుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో మునిగి చనిపోయాడు.

News April 23, 2025

కూలీ కుమారుడికి 593 మార్కులు

image

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

error: Content is protected !!