News April 12, 2025
అనంత: బాలికపై అత్యాచారం.. నిందితుని అరెస్ట్

12 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన నార్పల మండల కేంద్రంలో జరిగింది. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ తెలిపారు.
Similar News
News November 11, 2025
గోదావరిఖనిలో బయటపడ్డ అష్టభుజాల సింహవాహిని

రామగుండం ఎన్టీపీసీ ఏరియా సోలార్ ప్లాంట్ పక్కనే ఉన్న ఏరియాలో అష్టభుజాలతో సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడింది. విగ్రహం గుర్తించిన స్థానికులు విషయాన్ని హిందూ వాహిని శ్రేణులకు తెలపడంతో వారు అర్చకులు సతీష్ శాస్త్రితో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి విగ్రహాన్ని పాలతో సంప్రోక్షణ చేసి, పసుపుకుంకుమలను సమర్పించి ప్రత్యేక హారతులు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
News November 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 11, 2025
ఈసారి జూబ్లీహిల్స్ ఆదర్శం కావాలి.. ఓటెత్తి తీరాలి..!

2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మంది ఓటేసింది ఎప్పుడంటే 2009లోనే.. అప్పుడు 52 శాతం మంది ఓటు వేశారు. ఆ తరువాత ఈ ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. ఈ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందూ ఇలానే అనుకుంటారు. కానీ అలా జరగడం లేదు. మరి నేడైనా అందరూ పోలింగ్ కేంద్రాలకు కదలి ఓటెత్తి ఆదర్శంగా నిలవాలి.


