News April 12, 2025
అనంత: బాలికపై అత్యాచారం.. నిందితుని అరెస్ట్

12 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన నార్పల మండల కేంద్రంలో జరిగింది. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ తెలిపారు.
Similar News
News April 21, 2025
తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.
News April 21, 2025
26న ఎచ్చెర్లకు సీఎం.. వేట నిషేధ భృతికి శ్రీకారం

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పర్యటించనున్నారు. మత్స్యకారులకు రూ.20వేల చొప్పున చేపల వేట నిషేధ భృతిని అందజేస్తారు. తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. కాగా సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఈ నెల 14 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా భృతిని అందజేస్తోంది.
News April 21, 2025
నేటి నుంచి 57 నగరాల్లో కాంగ్రెస్ ప్రెస్‌మీట్లు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ED ఛార్జిషీట్ ఫైల్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ్టి నుంచి ఈనెల 24 వరకు ప్రెస్ మీట్లు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ‘కాంగ్రెస్ నిజాలు, బీజేపీ అబద్ధాలు’ క్యాంపెయిన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడతామంది. దేశంలోని 57 నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్‌మీట్లు నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ మేరకు సిటీస్, నేతల పేర్లతో జాబితా విడుదల చేసింది.