News April 12, 2025

అనంత: బాలికపై అత్యాచారం.. నిందితుని అరెస్ట్

image

12 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన నార్పల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మైనర్ బాలికకు రక్తస్రావం కావడంతో ఆ చిన్నారిని హుటాహుటిన అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ తెలిపారు.

Similar News

News April 18, 2026

ఈనెల 21న ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ అనంతపురం పర్యటన

image

ఈనెల 21న కే.ఎస్. జవహర్ అనంతపురం జిల్లాకు రానున్నారు. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఎస్సీ సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, రోస్టర్ అమలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.

News April 18, 2026

తాడిపత్రిలో నేడు వాహనాల బహిరంగ వేలం

image

తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 69 వాహనాలకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు టౌన్ సీఐ ఆరోహణరావు తెలిపారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు, రూ.5,000 ముందస్తు డిపాజిట్ చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వేలం ప్రక్రియ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరుగుతుందని, ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.