News July 3, 2024
అనంత: బాలికపై అత్యాచారం..

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను యువకుడు అత్యాచారం చేసిన ఘటన పుట్లూరు మండలంలో జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికను ఈ నెల 23న ఇంటి వద్ద నుంచి రవితేజ బైక్‌పై బలవంతంగా తీసుకెళ్లాడు. ఐషర్ వాహనంలో రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉదయం బాలిక తప్పించుకుని ఇంటికి చేరుకుంది. షాక్‌లో ఉన్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు. బంధువులు ధైర్యం చెప్పి ఆరా తీయగా విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 11, 2025
ఆనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు

అనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు వచ్చినట్లు అదనపు ఎస్పీ డి.వి. రమణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపి ఆదేశాలు జారీ చేశారు.
News February 10, 2025
రాప్తాడు వైసీపీలో ముసలం

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.