News February 12, 2025

అనంత: బీటెక్ ఫలితాల విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో డిసెంబర్‌, జనవరిలో నిర్వహించిన బీటెక్ 4-1, 4-2 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R15, R19, R20) పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News February 13, 2025

వీరఘట్టం: అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య

image

అనారోగ్య సమస్యలు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీరఘట్టంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మణరావు(38) కొన్నేళ్లుగా కాలేయ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో గడ్డిమందు తాగాడు. గుర్తించిన భార్య చోడవరపుదేవి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.

News February 13, 2025

HYD: అభిలాష ఉన్నవారికి ఉచితం సంగీతం, నృత్య శిక్షణ

image

అభిలాష ఉన్నవారికి ఉచితంగా సంగీతం, నృత్య శిక్షణ ఇస్తున్నామని వీఎస్. జనార్దనమూర్తి అన్నారు. గానసభలో 5 రోజుల పాటు సంగీత, సాహిత్య కార్యక్రమాల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గానసభ లలిత కళలకు నిత్యం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా సంగీత గురువు మల్లాది ఉష్ణ బృందం ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత కార్యక్రమం అద్భుతంగా సాగింది.

News February 13, 2025

జూన్‌లో ‘స్థానిక’ ఎన్నికలు?

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. MARలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లును కేంద్రానికి పంపాలని చూస్తోంది. అటు MAR, APRలో ఇంటర్, పది పరీక్షలుండటంతో ప్రభుత్వ టీచర్లంతా అందులోనే నిమగ్నం కానున్నారు. ఆపై APR, MAYలో ఎండల తీవ్రత వల్ల ఎన్నికలు నిర్వహించకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్, జులైలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందంటున్నారు.

error: Content is protected !!