News February 12, 2025

అనంత: ‘భర్తను హత్య చేసిన భార్య.. అక్రమ సంబంధమే కారణం’

image

కాశీ అనే వ్యక్తి హత్య కేసులో అతని భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈనెల 2న అనంతపురం రూరల్ పరిధిలో కాశీని ఇద్దరితో కలిసి భార్యే హత్య చేసినట్టు వెల్లడైందన్నారు. నిందితులను ఆర్డీటీ స్టేడియం వద్ద అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు.

Similar News

News December 1, 2025

నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి

image

ఉరవకొండ మండలం బూదిగవిలో రూ.43.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.

News November 30, 2025

2,81,298 మందికి పెన్షన్ పంపిణీ పంపిణీకి సిద్ధం: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో 2,81,298 మంది NTR భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు రూ.125.39 కోట్లు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 6:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగస్థులు పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లు పరిరక్షించాలని ఆదేశించారు.

News November 29, 2025

భూ సేకరణ భూబధాలయింపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ బదలాయింపు 15 రోజుల లోపల పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ బదలాయింపుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు ప్రతిరోజూ మానిటర్ చేయాలన్నారు. సమయపాలన ప్రకారం భూ సేకరణ బదలాయింపు పూర్తి చేయాలన్నారు.