News June 16, 2024

అనంత: భార్యపై అనుమానంతో కత్తితో భర్త దాడి

image

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాడిపత్రిలోని పాతకోటకు చెందిన దాదాపీర్.. అనుమానంతో భార్య రమీజాను అర్ధరాత్రి కత్తితో గొంతు కోశాడు. ఆమెను స్థానికులు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరికి వివాహం జరిగి కేవలం 5 నెలలు అయినట్లు తెలుస్తోంది.

Similar News

News November 24, 2025

టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు DEO శుభవార్త

image

గతంలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయి తిరిగి పరీక్షలు రాసే అవకాశం లేక మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థుల కోసం సార్వత్రిక విద్యాపీఠం మంచి అవకాశాన్ని కల్పించినట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. అలాంటి విద్యార్థులు అడ్మిషన్ ఫీజు కింద రూ.300 మాత్రమే చెల్లించి ఏపీ విద్యాపీఠం www.apopenschool.ap.gov.in వైబ్ సెట్ దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News November 24, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానివారు కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.