News April 3, 2024

అనంత: మరో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామ ఎండీయూ ఆపరేటర్‌ బండారు కొండయ్య, తాడిపత్రిలోని కో- ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ సీనియర్‌ క్లర్క్‌ టీ.రమేశ్ రెడ్డి ఉన్నారు.

Similar News

News November 24, 2025

ప్రజల నుంచి 450 అర్జీల స్వీకరణ: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం కలెక్టరేట్‌లోని PGRS కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి 450 అర్జీలను స్వీకరించామని తెలిపారు. PGRS అర్జీలను నాణ్యతగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.

టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు DEO శుభవార్త

image

గతంలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయి తిరిగి పరీక్షలు రాసే అవకాశం లేక మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థుల కోసం సార్వత్రిక విద్యాపీఠం మంచి అవకాశాన్ని కల్పించినట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. అలాంటి విద్యార్థులు అడ్మిషన్ ఫీజు కింద రూ.300 మాత్రమే చెల్లించి ఏపీ విద్యాపీఠం www.apopenschool.ap.gov.in వైబ్ సెట్ దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.