News August 29, 2024
అనంత మార్కెట్లో టమాటా కిలో రూ.23
అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో బుధవారం 3,800 టన్నులు టమాటాను రైతులు తీసుకొచ్చారు. 28 మండీల్లో టమాటా విక్రయాలు కొనసాగాయి. ఉదయం వేలం పాటలు నిర్వహించారు. కిలో గరిష్ఠంగా రూ.23, మధ్యస్థం రూ.15, కనిష్ఠం రూ.6 చొప్పున ధరలు పలికాయి. 15 కిలో బుట్ట ధర పరిశీలిస్తే గరిష్ఠ ధర రూ.345, మధ్యస్థం రూ.225, కనిష్ఠం రూ.90 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ ఇన్‌ఛార్జ్ రాంప్రసాద్ రావు తెలిపారు.
Similar News
News September 18, 2024
బెంగళూరు-ధర్మవరం ప్యాసింజర్ రైలు అనంతపురం వరకు పొడిగింపు
బెంగళూరు నుంచి ధర్మవరం వరకు నడుస్తున్న 06515/06516 ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారి బీఎస్ క్రిస్టోఫర్ ఆదేశాలు జారీచేశారు. సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం మీదుగా అనంతపురం వెళ్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వినతి మేరకు పొడిగించినట్లు తెలిపారు.
News September 18, 2024
జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
అనంతపురం జిల్లాను దేశంలో ప్రథమ స్థానంలో ఉండటానికి కావలిసిన అని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీఎంఐపీ పథకం పైన సమీక్షసమావేశం నిర్వహించార. రాష్ట్ర స్థాయి డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, జిల్లా వ్యవసాయ, మైక్రో ఇరిగేషన్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ తదితరులతో నిర్వహించారు.
News September 18, 2024
అనంత: మామిడి చెట్టుకు ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో రైతు మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. తాడిపత్రి మండల పరిధిలోని అయ్యవారిపల్లిలో రైతు అమరేశ్ రెండెకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే పెట్టిన పెట్టుబడులు సరిగా రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.