News October 1, 2024

అనంత: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు దుర్మరణం

image

రాయదుర్గం మండలం టీ.వీరాపురం సమీపంలో రాయదుర్గం-కణేకల్లు ప్రధాన రోడ్డుపై రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 4.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన బొమ్మన్నగా స్థానికులు గుర్తించారు.

Similar News

News October 5, 2024

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ఎనుములపల్లి విద్యార్థులు

image

అనంతపురంలోని న్యూటౌన్ జూనియర్ కాలేజ్ మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన క్రీడా పోటీల్లో పుట్టపర్తి మున్సిపల్ పరిధి ఎనుములపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 విభాగాల్లో గౌతమి, కౌశిక్ రెడ్డి, విజయ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ రమేశ్ బాబు తెలిపారు. వీరు పశ్చిమగోదావరి జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

News October 5, 2024

‘ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి.. ఆదర్శ గురువులుగా మారి’

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుదర్శన రావు, శశిధర్ అనేక మంది విద్యార్థులను ఇంజినీర్లుగా మార్చారు. గతంలో వారి ప్రభుత్వ ఇంజినీర్ ఉద్యోగాలను సైతం వదిలిపెట్టి ప్రొఫెసర్లుగా బోధన మార్గాన్నే ఎంచుకొని ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాలలో ఇంజినీర్లుగా, పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో JE, AE, AEEలుగా తీర్చదిద్దారు.

News October 5, 2024

అనంత: దసరా సెలవులలో ఊళ్లకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!

image

అనంతపురం: దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ సీఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. దొంగతనాలు జరుగకుండా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రజలు సహకరించి సీసీఎస్ పోలీసులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులు, బంగారం దొంగల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు.