News July 15, 2024
అనంత: రైతు సేవాకేంద్రాల్లో పశుగ్రాస జొన్న విత్తనాల పంపిణీ

అనంతపురం జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీతో పశుగ్రాస జొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి ఆదివారం వరకు రైతు సేవాకేంద్రాలు, పశువైద్యశాలల్లో పశుగ్రాస వారోత్సాలను నిర్వహించామన్నారు. పశుపోషణకు ఉపయోగపడే విధంగా 55 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. 75శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.
Similar News
News November 2, 2025
అనంతపురం: డివైడర్ను ఢీకొన్న బైకు.. యువకుడు మృతి

అనంతపురం నగర శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఆలుమూరుకు చెందిన అవినాష్ అనే యువకుడు మృతి చెందాడు. అవినాష్ బైక్పై అనంతపురం నుంచి హిందూపూర్కి వెళుతుండగా డివైడర్ను ఢీకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అవినాష్కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 2, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 2, 2025
రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి: కలెక్టర్

జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్లోని మినీ కాన్ఫరెన్స్ లో భారతీయ రెడ్ క్రాస్ సమైక్య అనంతపురం శాఖ కార్యకలాపాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రక్త కేంద్రాలలో సరిపడా రక్త నిల్వ ఉండేలా చూసుకోవడం ముఖ్యమైందని తెలిపారు.


