News August 8, 2024

అనంత: రైలు కింద పడి రైల్వే కూలి ఆత్మహత్య

image

గుత్తి జీఆర్‌పీ పరిధిలోని రాయలచెరువు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలి (ప్యాకింగ్ మిషన్ కూలి) మనోహర్(23) గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ ఎస్ఐ నాగప్ప చెప్పారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మనోహర్ కొన్ని రోజులుగా గుత్తి జీఆర్‌పీ పరిధిలో రైల్వే పనులు చేస్తున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Similar News

News September 9, 2024

అత్యాచారానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు: డీఎస్పీ

image

సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో దారుణం ఘటన జరిగింది. ఓ గ్రామంలో దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాని డీఎస్పీ శ్రీలత తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించామన్నారు. దీంతో నిందితుడు భయపడి నేడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. అతడు గతంలో వాలంటీర్‌గా పని చేసి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని డీఎస్పీ వివరించారు.

News September 9, 2024

శ్రీ సత్యసాయి: వినాయకుడి లడ్డూ ధర రూ.4,17,115

image

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో వినాయకుడి లడ్డూ భారీ స్థాయిలో ధర పలికింది. బంగ్లా బాయ్స్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. విష్ణువర్ధన్ 2 లడ్లు రూ.2.62 లక్షలు, రాజా రూ.85 వేలు, విశ్వనాథ్ చౌదరి రూ.60 వేలు.. మొత్త రూ. 4.17 లక్షలు ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

News September 9, 2024

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు నల్లమాడ విద్యార్థులు

image

నల్లమాడలోని పాత బాలాజీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వంశీ, ప్రశాంత్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ పోలె వెంకటరెడ్డి తెలిపారు. స్కూల్ గేమ్స్‌లో భాగంగా ఆదివారం కదిరిలో జరిగిన 44వ జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.