News October 27, 2024
అనంత రోడ్డు ప్రమాదంలో బాహడపల్లి యువకుడి మృతి

అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇస్కాన్ సభ్యులు దుర్మరణం పాలైన విషాదకర ఘటన తెలిసిందే. ఈ ఘటనలో మందస మండలం బాహడపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి బి షణ్ముఖరావు (21) మృతి చెందారు. ఇస్కాన్ ఆలయంలో భక్తునిగా ఉంటూ సంకీర్తనలకు వెళ్లి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 30, 2025
శ్రీకాకుళం: 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం

తుఫాన్ వర్షాలు కారణంగా జిల్లాలో 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా చేతికి అంది వచ్చిన పంట నేలవాలిందని, కొన్నిచోట్ల నీట మునిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట పొలాలను పరిశీలించి తుది అంచనా సిద్ధం చేస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫారుక్ అహ్మద్ ఖాన్ తెలిపారు.
News October 30, 2025
ఇచ్ఛాపురంలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్

‘మెంథా’ తుపాను ప్రభావంతో జిల్లాలో నష్టం వాటిల్లిన నేపథ్యంలో, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఇచ్ఛాపురం మండలంలో పర్యటించారు. తుపాన్ కారణంగా జిల్లాలో అత్యధికంగా ఈ మండలంలో 1,118 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. బిల్లంగి, జగన్నాథపురం గ్రామాల్లో నీటి ముంపులో ఉన్న వరి చేలును ఆయన పరిశీలించారు. 53 క్యూసెక్కులు నీరు బహుదానదిలో ప్రవహిస్తుందన్నారు. నష్టం అంచనా వేయాలన్నారు.
News October 30, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

★పొందూరులో 50 గ్రామాలకు రాకపోకలు బంద్
★సోంపేట ప్రభుత్వ పాఠశాలలో కూలిన చెట్టు
★పంటపొలాలు, వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు కూన, బగ్గు, బెందాళం
★నందిగం: కోతకు గురైన R&B రోడ్డు.. తక్షణ చర్యలు
★పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన పాతపట్నం ఎమ్మెల్యే
★కాశీబుగ్గలో పలు మెడికల్ షాపుల్లో దొంగతనాలు
★పలాస: వరహాల గెడ్డలో వ్యక్తి గల్లంతు
★ నారాయణపురం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగావళి


