News March 2, 2025

అనంత: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

image

కూడేరు మండలం కమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో సరస్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రాజు, ఆయన సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Similar News

News December 3, 2025

కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

image

కోకాపేట్ నియోపోలిస్ భూముల‌ వేలం ముగిసింది. న‌గ‌రానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎక‌రాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎక‌రానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ క‌నిపిస్తుండ‌టంతో ఇక్క‌డి క‌మ్యూనిటీని డెవ‌ల‌ప్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకే ఈ నాలుగు ఎక‌రాలను ఆన్‌లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

News December 3, 2025

బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

image

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.

News December 3, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్‌కౌంటర్‌లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.