News July 8, 2024
అనంత: రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీగార్డు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మీనారయణ విధులు ముగించుకుని బైక్‌లో వెళుతుండగా బత్తలపల్లి మండలం ముష్టూర్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 6, 2025
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామాంజి నేయులు

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుంతకల్లుకు చెందిన జింకల రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని వెంకటరామిరెడ్డి ఆయనకు సూచించారు.
News July 6, 2025
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
News July 5, 2025
గూగూడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

నార్పల మండలం గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం డీఎస్పీ వెంకటేశ్ శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, అగ్నిగుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు, అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కేటాయించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచామని చెప్పారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు.