News May 25, 2024
అనంత: వంకలో కొట్టుకెళుతున్న ఆవులను రక్షించిన స్థానికులు

విడపనకల్లు మండలం వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పాల్తూరు గ్రామం సమీపంలోని పెద్ద వంక ఉద్ధృతంగా ప్రవహించింది. వంకలో ఆవులు చిక్కుకుపోయి నీటిలో కొట్టుకుపోతుండగా అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే వాటిని కాపాడారు. మిగిలిన ఆవులు వరద తగ్గే వరకు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాయి.
Similar News
News October 14, 2025
సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి: కలెక్టర్ ఆనంద్

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి 3 వేలు పైగా మొక్కలు నాటలని ఆదేశించారు. అటవీ శాఖ 1.50 లక్షల మొక్కలు నాటాలని పేర్కొన్నారు.
News October 13, 2025
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ చేయించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
News October 13, 2025
రాష్ట్రస్థాయి వుషు పోటీలకి అనంతపురం విద్యార్థులు

రాష్ట్రస్థాయి అండర్-19 వుషు క్రీడల పోటీలకు అనంతపురం జిల్లా విద్యార్థులు ఎంపికైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీలు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 13 నుంచి 15 వరకు రాజమండ్రిలో పోటీలు జరుగుతాయని అన్నారు. ఎంపికైన విద్యార్థులు ఆదివారం సాయంత్రం రాజమండ్రికి పయనమయ్యారు. ఇవాళ ఉదయం ప్రాక్టీస్ సెషన్ అనంతరం పోటీలు ప్రారంభం అవుతాయని అన్నారు.