News May 24, 2024
అనంత: విద్యుత్ షాక్‌కు గురై బాలిక మృతి

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మరుట్ల గ్రామంలో భాను శ్రీ అనే బాలిక గురువారం రాత్రి ఇంట్లో విద్యుత్ షాక్‌కు గురైంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News October 19, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
నేడు అనంతపురంలో సందడి చేయనున్న సినీ నటి మీనాక్షి

సంక్రాంతికి వస్తున్నాం సినీ నటి మీనాక్షి చౌదరి ఆదివారం జిల్లాకు రానున్నారు. అనంతపురంలోని రాజీవ్ కాలనీలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
News October 19, 2025
‘రబీలో 1,07,503 హెక్టార్లు సాగులోకి రావొచ్చు’

రబీలో 1,07,503 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పప్పుశనగ 65,017 హెక్టార్లు, నీటి వసతి కింద వేరుశనగ 17,982 హెక్టార్లు, మొక్కజొన్న 7888 హెక్టార్లు, వరి 6069, జొన్న 4919, ఉలవ 1377, పొద్దుతిరుగుడు 1230 హెక్టార్లలో సాగులోకి రావొచ్చన్నారు. గతేడాది రబీలో సాధారణ సాగు 1.18 లక్షల హెక్టార్లతో పోల్చితే ఈ ఏడాది 11 హెక్టార్లు తగ్గవచ్చన్నారు.