News May 24, 2024

అనంత: విద్యుత్ షాక్‌కు గురై బాలిక మృతి

image

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మరుట్ల గ్రామంలో భాను శ్రీ అనే బాలిక గురువారం రాత్రి ఇంట్లో విద్యుత్ షాక్‌కు గురైంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News February 8, 2025

కొడుకు ముందే ప్రాణాలు విడిచిన తల్లి

image

నార్పలకు చెందిన గంగమ్మ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఆమె తన కొడుకు మంజునాథ్‌తో కలిసి నార్పల నుంచి హిందూపురానికి బైక్‌లో వెళ్తున్నారు. దారి మధ్యలో CK పల్లి మండలం NS గేటు సమీపంలో బైక్ గుంతలోకి దిగడంతో ఆమె ఎగిరి కింద పడ్డారు. గంగమ్మ తలకు తీవ్రగాయమై మృతి చెందింది. ఘటనకు ర్యాష్ డ్రైవింగే కారణమని స్థానికులు తెలిపారు. మృతిరాలి భర్త ఈశ్వరయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 

News February 8, 2025

అనంతపురం జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్

image

అనంతపురం జిల్లాలోని మహిళలకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహిళలకు కుట్టు మెషీన్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా మహిళలకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News February 8, 2025

సత్తా చాటిన తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు

image

అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పోలీసు స్పోర్ట్ మీట్‌లో తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు సత్తా చాటారు. దాదాపు 9 విభాగాలలో ప్రతిభ చూపినట్లు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. ట్రోపీలను, బహుమతులను అనంతపురం రేంజ్ డీఐజీ షిమోన్షి, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణి బాబు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!