News September 6, 2024
అనంత: విద్యుత్ షాక్‌తో టీడీపీ కార్యకర్త మృతి
గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగార్జున విద్యుదాఘాతంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అయన మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
Similar News
News October 7, 2024
కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇలా..!
అనంతపురం పట్టణం పరిధిలోని స్థానిక కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు తగ్గాయి. ఆదివారం మొత్తం 18 మండీలకు 675 టన్నులు వచ్చాయి. కిలో గరిష్ఠంగా రూ.52, మధ్యస్థం రూ.40, కనిష్ఠం రూ.30 చొప్పున ధరలు పలికాయి. 15 కిలోల బుట్ట ధర గరిష్ఠం రూ.780, మధ్యస్థం రూ.600, కనిష్ఠం రూ. 450 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ యార్డు ఇన్‌ఛార్జి రాంప్రసాద్ రావ్ ఓ ప్రకటనలో తెలిపారు.
News October 7, 2024
పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు: కలెక్టర్
అనంతపురం జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ పి.జగదీష్, జేసీ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 15వ తేదీ తర్వాత జిల్లాలో ఉన్న 5 ఇసుక రీచ్‌లు మ్యానువల్ ఆపరేషన్‌లో ఉంటాయన్నారు.
News October 6, 2024
కదిరిలో ఘోరం.. పసి బిడ్డను వదిలి వెళ్లిన కసాయి తల్లి
స్థానిక RTC బస్‌స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ అక్కడే ఉన్న మరో మహిళకు తన 5 నెలల చిన్న పాపను తాను బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని ఇచ్చి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళను గురించి వాకబు చేశారు. ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి పాపను ఈ రోజు ICDS వారికి అప్పగించారు. ఆచూకీ తెలిస్తే సీఐ, కదిరి టౌన్, సెల్ 94407 96851 సమాచారం ఇవ్వాలని కోరారు.