News June 11, 2024
అనంత: విధులు నిర్వహిస్తూ గుండెపోటుకు గురైన జేఎల్ఎం

విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా విధులు నిర్వహిస్తున్న జిలాన్ బాషా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం ఉదయం కనేకల్లు మండలంలోని మాల్యం వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఛాతి నొప్పితో సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన తోటి ఉద్యోగులు ఆయనని కనేకల్లు క్రాస్ వద్ద ఉన్న ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.
Similar News
News March 26, 2025
జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్

జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈరోజు సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. మున్సిపల్ పట్టణాలు మండల కేంద్రాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వాహనాలు పత్రాలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
News March 26, 2025
పోలీసుల అదుపులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి!

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని సోమందేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. <<15892859>>రామగిరి<<>> ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులకు మద్దతుగా వెళ్తున్న ఆయనను జాతీయ రహదారిపై డీఎస్పీ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు ఆయనకు చెప్పారు.
News March 26, 2025
విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన.. ప్రిన్సిపల్‌పై పోక్సో కేసు

గోరంట్లలోని నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మిపతిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన గిరిజన సంఘాల నాయకులు పోలీసులను కలిసి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ రత్న కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.