News December 7, 2024
అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి విదితమే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మార్పులతో కూడిన పథకం అమలు చేయనుంది టీటీడీ.
Similar News
News December 4, 2025
రూ.5 లక్షలకు అఖండ టికెట్‌ను కొనుగోలు చేసిన చిత్తూరు MLA

విడుదలకు సిద్ధమైన బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా టికెట్టును చిత్తూరు MLA గురజాల జగన్ మోహన్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. గురువారం బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి సినిమా టికెట్టును అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. బాలకృష్ణ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు. బాలకృష్ణ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
News December 4, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
News December 4, 2025
చిత్తూరు జిల్లా అధికారులను అభినందించిన పవన్ కళ్యాణ్

చిత్తూరు పర్యటనలో DyCM పవన్ కళ్యాణ్ చెప్పిన సూచనలను అధికారులు పూర్తిగా పాటించారు. బోకేలు, శాలువాలు, ఫ్రూట్ బాస్కెట్లు ఇవ్వడం లాంటివి ఎవరూ చేయలేదు. ఇవన్నీ ఉద్యోగులకూ, ప్రభుత్వ నిధులకూ భారం అవుతాయని, అలాంటి మర్యాదలు వద్దని పవన్ కళ్యాణ్ ముందే పలుమార్లు సూచించారు. ఈ నియమాన్ని విధేయంగా అమలు చేసినందుకు అధికారులను ఆయన అభినందించారు. పార్టీ నేతలకూ ఇలాంటి ఖర్చులను సేవా కార్యక్రమాలకు మళ్లించాలని సూచించారు.


