News February 22, 2025
అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 23, 2025
అనంతపురంలో కిలో చికెన్ రూ.120

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అనంతపురంలో ఇవాళ కిలో చికెన్ రూ.120-140 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
News February 23, 2025
అనంతపురంలో కిలో టమాటా రూ.10

అనంతపురంలో కక్కలపల్లి మార్కెట్లో నిన్న కిలో టమాటా రూ.10 పలికింది. సరాసరి ధర రూ.8, కనిష్ఠ ధర రూ.7తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.20,700 తో అమ్ముడయ్యాయి.
News February 23, 2025
అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో 7,293 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.