News February 22, 2025
అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 17, 2025
జగిత్యాల: పార్టీ బలోపేతం కోసం సంఘటన్ సృజన్ అభియాన్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుక్రవారం ‘సంఘటన్ సృజన్ అభియాన్’ సమావేశం జరిగింది. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కార్యకర్తల గుర్తింపునకు సూచనలు చేశారు. ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు స్థానిక నాయకులతో డీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియపై చర్చించారు. పార్టీ నేతలు, యువజన, మహిళా, రైతు, మైనారిటీ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
News October 17, 2025
జగిత్యాల: సన్న/దొడ్డు రకం ధాన్యానికి వేర్వేరు కేంద్రాలు

జగిత్యాల కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు ప్రారంభించవద్దని, ప్రతి కేంద్రంలో అవసరమైన వస్తువులు సిద్ధం చేయాలని సూచించారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేర్వేరు కేంద్రాలు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రవాణాను వేర్వేరు నిర్వహించి రైతులకు స్పష్టత కల్పించాలని అన్నారు.
News October 17, 2025
జగిత్యాలలో శిశు మరణాలపై సమీక్ష

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే. ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో చైల్డ్ డెత్ రివ్యూ సమీక్ష సమావేశం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు జరిగిన 40లో 10 శిశు మరణాలపై ఆడిట్ నిర్వహించారు. ఎక్కువగా ప్రీ టర్మ్ డెలివరీలు, హార్ట్ డిసీజెస్, ఆస్పిరేషనల్ కేసుల వల్ల మరణాలు జరిగాయని తెలిపారు. మరణాలపై తల్లులు, ఆశ, మహిళా ఆరోగ్య కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.