News July 15, 2024
అనంత: 13ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం

13ఏళ్ల బాలికపై 63ఏళ్ల వ్యక్తి లైంగిక వేధించిన ఘటన హిందూపురంలో జరిగింది. పోలీసుల వివరాలు..బాలిక తల్లి భర్తతో విడిపోయి 2022లో హాబీబ్ఖాన్తో ఉండేది. ఆమె పనికివెళ్లిన సమయంలో హబీబ్ బాలికను లైంగికగా వేధించాడు. 2023లో తల్లి మృతిచెందినప్పటికీ బాలిక అతడితోనే ఉంటోంది. ఇటీవల హబీబ్కు హెల్త్ బాగోలేక బాలికతో కలిసి బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి సిబ్బందికి అనుమానంతో బాలికను విచారించగా విషయం బయటపడింది.
Similar News
News November 24, 2025
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు DEO శుభవార్త

గతంలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయి తిరిగి పరీక్షలు రాసే అవకాశం లేక మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థుల కోసం సార్వత్రిక విద్యాపీఠం మంచి అవకాశాన్ని కల్పించినట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. అలాంటి విద్యార్థులు అడ్మిషన్ ఫీజు కింద రూ.300 మాత్రమే చెల్లించి ఏపీ విద్యాపీఠం www.apopenschool.ap.gov.in వైబ్ సెట్ దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News November 24, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానివారు కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.