News June 20, 2024

అనంత: 29న జాతీయ లోక్ అదాలత్

image

ఈ నెల 29న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ సూచించారు. బుధవారం జిల్లా జడ్జి ఛాంబర్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఉమ్మడి జిల్లా ఎస్పీలు గౌతమి శాలి, మాధవరెడ్డిలతో సమావేశమయ్యారు. లోక్ అదాలత్‌‌పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News September 10, 2024

13వ తేదీ లోపు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయండి: కలెక్టర్

image

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో ఈ నెల 13వ తేదీ లోపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆల్‌ ఇండియా రేడియోలో ప్రతి గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేయాలన్నారు.

News September 10, 2024

శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ఎంపిక

image

శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు, ఇన్-సానిటరీ లెట్రిన్లు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల నుంచి నివేదికలు అందాయన్నారు. దీంతో సత్య సాయి జిల్లాను మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారన్నారు.

News September 10, 2024

వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే రూ.10లక్షల విరాళం

image

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. తన వంతు రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు. సీఎం ఎమ్మెల్యే దగ్గుపాటిని అభినందించారు.