News April 24, 2024

అనంత: 594 మార్కులతో సత్తా చాటిన బైనేని జాష్ణవి

image

అనంతపురం నగరానికి చెందిన బైనేని జాష్ణవి సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాలలో 594 మార్కులతో సత్తా చాటింది. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడమే తన లక్ష్యమన్నారు. ఆమెను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. 

Similar News

News November 1, 2025

ఖాళీల భర్తీలు పక్కా ఉండాలి: అనంత కలెక్టర్

image

ఐసీడీఎస్‌లో ఖాళీల భర్తీకి నిబంధనల ఉల్లంఘనకు తావులేదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వర్కర్లు, 68 హెల్పర్లు కలిపి మొత్తం 104 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News October 31, 2025

పోలీసు అమరవీరులకు జోహార్లు

image

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జిల్లా ఎస్పీ జగదీశ్ జోహార్లు తెలిపారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల ముగింపు రోజున శుక్రవారం అనంతపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జగదీష్, ఇతర పోలీస్ అధికారులు అమర వీరులకు నివాళులర్పించారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు, వ్యాస రచన పోటీలు, ఉచిత వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు SP తెలిపారు.

News October 30, 2025

మహిళ సూసైడ్ అటెంప్ట్

image

గుత్తి మండలం అబ్బేదొడ్డినికి చెందిన శిరీష పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని శిరీషకు సూచించారు.