News March 30, 2025
అనకాపల్లిలో పీజీఆర్ఎస్ రద్దు

ఈనెల 31 సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాలు, సచివాలయాల్లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించబడదన్నారు. జిల్లా ప్రజలంతా గమనించాలని ఆమె కోరారు.
Similar News
News December 3, 2025
వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News December 3, 2025
MDK: సర్పంచ్, వార్డు అభ్యర్థుల గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..?

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు. గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న వారికి గుర్తుల కేటాయింపు ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గుర్తుల కేటాయింపు తెలుగు అక్షర క్రమానుసారం జరుగుతుంది. నామినేషన్ పత్రంలో అభ్యర్థి పేరు ఎలా నమోదు అయిందో, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తులను కేటాయిస్తారు.
News December 3, 2025
కృష్ణా: డీసీసీ అధ్యక్షుల రేసులో అందె, శొంఠి

కాంగ్రెస్ పార్టీ పునః నిర్మాణంలో భాగంగా తొలుత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టనుంది. కృష్ణాజిల్లా డీసీసీ పదవికి ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అవనిగడ్డకు చెందిన అందే శ్రీరామ్మూర్తి, పెడనకు చెందిన శొంఠి నాగరాజు రేసులో ముందు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇటీవలే జిల్లాకు పరిశీలకునిగా వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంజయ్ దత్ మచిలీపట్నం వచ్చి అభిప్రాయసేకరణ చేపట్టి వెళ్లారు.


