News February 14, 2025
అనకాపల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణపై వర్క్ షాప్

అనకాపల్లిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీస్ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ శుక్రవారం నిర్వహించారు. కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధికారి రంగధామ్ మాట్లాడుతూ.. చట్టపరమైన అంశాలు దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Similar News
News March 22, 2025
ములుగు జిల్లాకే తల మాణికం రామప్ప చెరువు!

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో గల కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సు జిల్లాకే తలమానికం అని చెప్పవచ్చు. సుమారు 6000 ఎకరాల్లో పంటలకు సాగునీరు నందిస్తూ, నాలుగు మండలాలకు తాగునీరును అందించడమే కాక ఈ సరస్సులోని నీటిని గణపసముద్రం, పాకాల సరస్సులకు తరలిస్తున్నారు. రామప్ప సరస్సును రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నది. (నేడు ప్రపంచ జల దినోత్సవం)
News March 22, 2025
IPL: ఈసారైనా వీరికి టైటిల్ దక్కేనా?

ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. వాటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG ఉన్నాయి. ఈ సారైనా తమ ఫేవరెట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ నేటి నుంచి మే 25 వరకు కొనసాగనుంది. 64 రోజులపాటు 74 మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుతం టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి.
News March 22, 2025
ALERT: రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA తెలిపింది. మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని పేర్కొంది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇవాళ అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.