News March 22, 2025

అనకాపల్లిలో రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట మండలం నేషనల్ హైవేపై ఎన్‌జీ పాలెం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. అతికష్టం మీద అతడిని బయటకు తీశారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 9, 2026

విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక నిఘా: మంత్రి డోలా

image

విశాఖను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ‘గ్లోబల్ సిటీ’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో వినిపిస్తున్న శానిటేషన్ సమస్యలను జనవరి చివరి నాటికి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. మహిళల భద్రత కోసం నగరాన్ని చీకటి ప్రాంతాలు లేని ‘ఇల్యుమినేషన్ సిటీ’గా మార్చాలన్నారు.

News January 9, 2026

విశాఖలో ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖ స్పష్టత

image

విశాఖ జిల్లాలో రబీ పంటల సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) తెలిపారు. జిల్లాకు జనవరి వరకు 1096 టన్నుల యూరియా అవసరం కాగా.. 1651 టన్నులు అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1073 టన్నుల ఎరువులు (యూరియా 600 టన్నులు) నిల్వ ఉన్నాయని, ఇవి జనవరి చివరి వరకు రైతులకు సరిపోతాయని పేర్కొన్నారు.

News January 9, 2026

విశాఖ: బెట్టింగ్ యాప్ నిర్వహణ.. మరో ఇద్దరి అరెస్ట్

image

విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న మరో ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన రాంబాబు, సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన హేమ సుబ్రహ్మణ్యం మూర్తి కలిసి పలు బెట్టింగ్ యాప్‌లు నిర్వహించి మోసాలకు పాల్పడ్డారు. సాంకేతిక పరిజ్ఞానంతో వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.