News March 5, 2025
అనకాపల్లిలో రేపు వైన్ షాపులకు డ్రా

అనకాపల్లి జిల్లాలో కల్లు గీత కార్మికులకు సంబంధించి కేటాయించిన 15 షాపులకు గురువారం డ్రా తీయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి అనకాపల్లిలోని గుండాల జంక్షన్ వద్ద S.R.శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్లో డ్రా నిర్వహించనున్నారు. నిన్నటితో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో డ్రా తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News December 5, 2025
స్టూడెంట్ అసెంబ్లీని సూపర్ హిట్ చేశారు: సీఎం చంద్రబాబు

భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా PTM కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇటీవల జరిగిన స్టూడెంట్ అసెంబ్లీ కార్యక్రమాన్ని దగ్గరుండి చూశానని అందులో పిల్లలు అదరగొట్టారనన్నారు. స్టూడెంట్ అసెంబ్లీ ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చిందని చెప్పారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు, బాధ్యల గురించి వివరించి ఆ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేశారు.
News December 5, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00
News December 5, 2025
ఆదోని జిల్లా డిమాండ్.. టీడీపీ నేతలపై సీఎం అసంతృప్తి

కర్నూలు జిల్లా నేతల తీరుపై CM చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండును ముందుగా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు ఆదోని జిల్లా డిమాండ్ లేదని తిక్కారెడ్డి వివరించినట్లు సమాచారం. దీనిపై జిల్లా నేతలంతా చర్చించుకుని తన వద్దకు రావాలని సీఎం సూచించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.


