News March 5, 2025
అనకాపల్లిలో రేపు వైన్ షాపులకు డ్రా

అనకాపల్లి జిల్లాలో కల్లు గీత కార్మికులకు సంబంధించి కేటాయించిన 15 షాపులకు గురువారం డ్రా తీయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి అనకాపల్లిలోని గుండాల జంక్షన్ వద్ద S.R.శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్‌లో డ్రా నిర్వహించనున్నారు. నిన్నటితో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో డ్రా తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 8, 2026
వరంగల్: టైపు రైటింగ్ లోయర్ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడిలో తప్పులు..!

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గత సంవత్సరం డిసెంబర్ 22న నిర్వహించిన టైపు రైటింగ్ లోయర్ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడిలో దొర్లిన తప్పులు అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ 22న పరీక్షలు జరుగగా ఈనెల 7వ తేదీన విడుదల చేసిన రిజల్ట్స్‌లో మాత్రం డిసెంబర్ 23న పరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు. చాలామంది ఫెయిల్ అవ్వగా పరీక్షలపై వరంగల్లో అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేశారు.
News February 8, 2026
గోవా వెళ్తున్నారా? ఈ పని చేస్తే 24 గంటలు జైలులో ఉండాల్సిందే

గోవాలో ఇష్టానుసారం ఫొటోలు, వీడియోలు తీస్తే 24 గంటలు జైలులో గడపాల్సిందే. పర్మిషన్ లేకుండా విదేశీయులు/ఇండియన్స్ ఫొటోలు తీసినా, సెల్ఫీలకు వేధించినా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. టూరిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసుల నిర్ణయంపై SMలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. నార్త్ గోవా బాగా బీచ్‌లో టూరిస్టులను వేధించిన తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.
News February 8, 2026
మరణించినవారి ఫొటోలు ఎక్కడ ఉంచాలంటే?

చనిపోయిన వారి ఫొటోలను పూజా మందిరంలో దేవుడి పటాలతో కలిపి పెట్టకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది వాస్తురీత్యా తప్పని వివరిస్తున్నారు. ‘మరణించిన వారు ఎంతటి వారైనా దేవుళ్లతో సమానం కాదు. వారి ఫొటోలను యమస్థానమైన దక్షిణ వైపు గోడలకు తగిలించడం మంచిది. వారి ఫొటోలు హాలులో కూడా ఉంచకూడదు. లేకపోతే ఇంట్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. శాస్త్రనియమాలను అనుసరించి సరైన దిశలో ఉంచాలి’ అన్నారు. <<-se>>#Vasthu<<>>


