News June 4, 2024
అనకాపల్లిలో సీఎం రమేశ్ గెలుపు
అనకాపల్లి ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ 2,96,530 పైచిలుకు మెజార్టీలో ఉన్నారు. సీఎం రమేశ్‌కు 7,62,069 ఓట్లు పోలవ్వగా.. తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుకి 4,65,539 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్తి వేగి వెంకటేశ్‌కు 25,651 ఓట్లు పోలవ్వగా.. నోటాకు 26,235 మంది ఓటేశారు.
Similar News
News November 3, 2024
సిడ్నీ చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆతిథ్యమిస్తున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనడానికి ఆయన సిడ్నీకి వెళ్లారు. ఆయనతో పాటు శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు. అయ్యన్నపాత్రుడును సిడ్నీ విమానాశ్రయంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
News November 3, 2024
విశాఖ: ‘అద్భుతమైన టూరిజం ప్రాజెక్టును నిర్మించాం’
గత ప్రభుత్వం గతంలో ఎక్కడాలేని విధంగా రుషికొండపై అద్భుతమైన టూరిజం ప్రాజెక్టును నిర్మించినట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం విశాఖలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంతంగా నిర్మించుకున్నట్లుగా చెప్పడంపై మాజీ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.
News November 3, 2024
‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా చంద్రబాబు’
సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలోని రుషికొండపై ఉన్న భవనాలను శనివారం సందర్శించిన విషయం తెలిసిందే. విశాఖ ఎమ్మెల్యేలు దగ్గరుండి సీఎంకు భవనాలను చూపించారు. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా!.. అమరావతిలో ఇలా కట్టలేదని సిగ్గుపడ్డావా?’ అంటూ ట్వీట్ చేశారు.