News February 17, 2025

అనకాపల్లిలో 25 మందిపై కేసుల నమోదు

image

అనకాపల్లి టౌన్ పరిధిలో బహిరంగ ప్రాంతాల్లో మద్యం తాగిన 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు ట్రైనీ డీఎస్పీ M.V Krishna చైతన్య వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం వివిధ ధాబాలు, ఇతర ప్రాంతాల్లో సిబ్బందితో దాడులు చేశామన్నారు. పలుచోట్ల మద్యం తాగుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశామని తెలిపారు.

Similar News

News December 10, 2025

గొడవలు ఎందుకొస్తాయంటే?

image

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్‌గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

News December 10, 2025

కాశీలో శని దోషాలు పోగొట్టే ఆలయం

image

కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి దేవి ఆలయాలతో పాటు అన్నపూర్ణాదేవి గుడి కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఆహారానికి లోటుండదని నమ్మకం. అలాగే సంకట మోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే సంకటాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి దర్శనంతో ఏలినాటి శని దోషాలు పోతాయని అంటున్నారు. భక్తులు మణికర్ణికా, దశాశ్వమేధ ఘాట్‌లు దర్శించి గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.

News December 10, 2025

WGL: ఓటు విలువ ఐదేళ్లు!

image

రూ.500, రూ.1000 తీసుకోవడం కాదు నీ ఓటు ఐదేళ్ల ఆశయం. రోడ్లు, తాగునీరు, విద్యుత్, చదువు, ఉపాధి లాంటి సదుపాయాలు కల్పించే నేతను ఎన్నుకోవడం దాని లక్ష్యం. ఆ ఓటుకు నోటు అనే మరక అంటించకు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనేది నానుడి. అలాంటివి మన ఉమ్మడి జిల్లాలో 1,708 ఉన్నాయి. వాటిని బలోపేతం చేసే సర్పంచ్‌ను ఎన్నుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. దానిని అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తేనే ఐదేళ్లకు సార్థకత లభిస్తుంది.