News April 14, 2025
అనకాపల్లి: అంబేద్కర్ ప్రపంచ మేధావి: హోంమంత్రి

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావిగా హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి మండలం గుండాల జంక్షన్‌లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో హోం మంత్రి పాల్గొన్నారు. జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జేసీ జాహ్నవి పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
జనగామ: కొబ్బరి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి

చిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామ పరిధిలోని లూనావత్ తండాకు చెందిన గూగులోత్ సురేశ్ (24) ఆదివారం సాయంత్రం కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య అక్షర 8 నెలల గర్భిణి కావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
News February 23, 2026
నంజంపేట పోస్టుమాస్టర్‌కు మళ్లీ అవార్డ్

సోమల(M) నంజంపేట పోస్టుమాస్టర్ చిదానందంను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ సన్మానించారు. ఆదివారం గుంటూరులో జీడీఎస్ సమ్మేళన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్ సేవకులను సన్మానించారు. వారిలో చిదానందం రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. కాగా ఈయన గతేడాది కూడా ప్రతిభ కనబరచి జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు.
News February 23, 2026
26న అమెరికా-ఇరాన్ న్యూక్లియర్ చర్చలు

అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ చర్చలకు రంగం సిద్ధమైంది. జెనీవా వేదికగా ఈ నెల 26న ఇరు దేశాల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఒమన్ మధ్యవర్తులు తెలిపారు. త్వరలోనే US రాయబారి స్టీవ్‌ను కలవనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మిడిల్ ఈస్ట్‌లో US సైన్యాన్ని మోహరిస్తున్నప్పటికీ తాము ఒత్తిడికి గురికాబోమని స్పష్టం చేశారు.


