News March 17, 2025

అనకాపల్లి: ‘అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి’

image

స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రతి మండల ప్రత్యేక అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో మండల స్థాయి సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమన్వయ కమిటీలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. సింగిల్ యూజ్, ప్లాస్టిక్ నిషేధం, పరిశుభ్రతపై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలన్నారు.

Similar News

News November 22, 2025

రైతులకు సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

image

రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ చేసే విధంగా కలెక్టర్ ట్రేడర్లతో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, సాగు చేసిన పంటలకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News November 22, 2025

పెద్దపల్లి: మళ్లీ మక్కాన్ సింగ్‌కే అవకాశం..!

image

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మరోసారి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌కే అధిష్ఠానం అవకాశం కల్పించింది. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News November 22, 2025

సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు ఎవరంటే!

image

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా గజ్వేల్‌కు చెందిన తూంకుంట నర్సారెడ్డి కూతురు తూంకుంట ఆంక్షారెడ్డి నియమితులయ్యారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న అధ్యక్ష పదవికి ఎంతో మంది పోటీ పడ్డారు. చివరికి మహిళా నాయకురాలైన ఆంక్షారెడ్డికి అధ్యక్ష పదవి లభించడంతో ఉత్కంఠకు తెర పడింది. 120 మందికి పైగా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.