News February 12, 2026

అనకాపల్లి: అభివృద్ధి పనులను త్వరితన పూర్తి చేయాలి

image

జిల్లాలో మంజూరుచేసిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిధులు మురిగిపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి మండలానికి ఐదు గ్రామాలను ఓడీఎస్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.

Similar News

News March 11, 2026

జూన్ 2నే వరంగల్ కలెక్టరేట్ ప్రారంభం

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినొత్సవం రోజునే వరంగల్ నూతన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీవోసీ) ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. HYDలో మంగళవారం జరిగిన జిల్లా మంత్రి సమావేశంలో ఉమ్మడి జిల్లాలో పురోగతిలో ఉన్న అభివ్భద్ది పనులపై సమీక్షించారు. కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, అండర్ డ్రైనేజీ పనుల శంకుస్థాపన, భద్రకాళీ పనులను వేగంగా పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించనున్నట్లు సమాచారం.

News March 11, 2026

ANU హాస్టల్‌లో దారుణం.. విద్యార్థుల భోజనంలో ఈగలు..!

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్పోర్ట్స్ హాస్టల్ విద్యార్థులకు అందించిన భోజనంలో ఈగలు వచ్చిన సంఘటన కలకలం రేగింది. మంగళవారం రాత్రి భోజనంలో ఈగల రావడంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అపరిశుభ్రమైన భోజనాన్ని అందించడంతో విద్యార్థులు ప్రశ్నించినప్పటికీ అధికారులు స్పందించలేదని విద్యార్థులు చెప్తున్నారు. కలుషితమైన ఆహారం తినడంతో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యతని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

News March 11, 2026

అమెరికాలో వరంగల్ మహిళ మృతి!

image

వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొ. కె.లక్ష్మారెడ్డి-వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె శ్వేత(40) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. శ్వేత తన భర్త వీరటి సురేష్ రెడ్డితో కలిసి అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఇండియా టైమింగ్స్ ప్రకారం ఆదివారం రాత్రి కుటుంబంతో కలిసి ఓ ఫంక్షన్‌కి వెళ్లి వచ్చారు. నిద్రలోనే గుండెపోటు వచ్చి ఉంటుందని అక్కడి వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది.