News February 12, 2026
అనకాపల్లి: అభివృద్ధి పనులను త్వరితన పూర్తి చేయాలి

జిల్లాలో మంజూరుచేసిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిధులు మురిగిపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి మండలానికి ఐదు గ్రామాలను ఓడీఎస్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.
Similar News
News March 13, 2026
BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

AP: ఉగాది కానుకగా PM కిసాన్‌తోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో 46.85 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ.6 వేల చొప్పున జమ చేశారు. వీటిలో పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలున్నాయి. మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <
News March 13, 2026
ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతుందా?.. డాక్టర్లు ఏమన్నారంటే!

మద్యం తాగితే త్వరగా నిద్ర పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది ఒక పెద్ద భ్రమ అంటున్నారు వైద్యులు. ‘ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర తగ్గి, రాత్రివేళ తరచూ మెలకువ వస్తుంది. దీంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. గురక & స్లీప్ అప్నియా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కోసం మద్యానికి దూరంగా ఉండటమే బెటర్’ అని సూచిస్తున్నారు. SHARE IT
News March 13, 2026
తిరుపతిలో 16న జాబ్ మేళా.. 650 జాబ్స్

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్ (MCC)లో 16వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 650 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


