News February 12, 2026
అనకాపల్లి: అభివృద్ధి పనులను త్వరితన పూర్తి చేయాలి

జిల్లాలో మంజూరుచేసిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిధులు మురిగిపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి మండలానికి ఐదు గ్రామాలను ఓడీఎస్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.
Similar News
News March 14, 2026
కోదాడలో 42 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

కోదాడ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 42 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో డొమెస్టిక్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ మారుస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రీఫిల్లింగ్ పరికరాలను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం పంచనామా నిర్వహించి సిలిండర్లను శ్లోక గ్యాస్ గోదాముకు తరలించారు.
News March 14, 2026
గిరి పుత్రులకు అండగా ఉంటాం: పవన్ కళ్యాణ్

తాను గిరిపుత్రులకు అండగా ఉంటానని, వారి రహదారి కష్టాలు చూడలేక.. వారు కోరకపోయినా రోడ్లు వేయించామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో మాటా మంతీ కార్యక్రమంలో ఆయనకు గిరిజనులు పలు సమస్యలు విన్నవించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కూడా వేయలేదన్నారు. 40 ఇళ్లకు రూ.2 కోట్లు ఖర్చు చేసి రోడ్డు వేశామన్నారు.
News March 14, 2026
కలెక్టరేట్: హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ప్రవేశాలు ప్రారంభమైనట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా 60 సీట్లు భర్తీ చేస్తారని, ఎంపికైన వారికి నెలకు రూ. 2,500 స్టైపెండ్ అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు klbiiht.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


