News February 3, 2025

అనకాపల్లి: అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

image

వీఎంఆర్డీఏ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనకాపల్లి మండలం సిరసపల్లి, అంతకాపల్లి, బాటజంగాలపపాలెం గ్రామాల్లో వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్‌తో కలిసి పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వారి వెంట సర్వే డిపార్ట్మెంట్ సహాయ సంచాలకులు గోపాలరాజు, ముఖ్య ప్రణాళిక అధికారి శిల్ప, ప్రధాన ఇంజనీర్ భవాని శంకర్ ఉన్నారు.

Similar News

News July 8, 2025

పవన్ కళ్యాణ్ ఆగ్రహం

image

AP: MLA ప్రశాంతి రెడ్డిపై మాజీ MLA నల్లపరెడ్డి చేసిన <<16985283>>వ్యాఖ్యలను <<>>Dy.cm పవన్ ఖండించారు. ‘మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం YCP నేతలకు అలవాటుగా మారింది. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుంది. ఆ మాటలు బాధించాయి. వ్యక్తిగత జీవితాలే లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలుంటాయి’ అని హెచ్చరించారు.

News July 8, 2025

కోడూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కోడూరు మండలం చిట్వేలి ప్రధాన రహదారి గంధంవడ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. కోనేటి పెంచలయ్య (45) కోడూరులో కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. సోమవారం రాత్రి మోటార్ బైక్‌పై చిట్వేలి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News July 8, 2025

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..51% పనులు పూర్తి.!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 51 శాతం పనులు పూర్తయినట్లు SCR GM సందీప్ మాథూర్ తెలియజేశారు. ఎక్కడికక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ పరీక్షలు చేత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.