News January 11, 2025
అనకాపల్లి: ‘అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు’

సంక్రాంతి పండగ పురస్కరించుకుని పేకాట, జూదం, కోడిపందేలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇటువంటి కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు.
Similar News
News September 13, 2025
విశాఖ: లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారం

విశాఖ జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 124 మోటార్ ప్రమాద కేసులు పరిష్కరించారు. నష్టపరిహారం రూ.4,40,04750 అందజేశారు. 155 సివిల్ కేసులు, 10,190 క్రిమినల్ కేసులు, 239 ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేశారు. రాజీ మొత్తం రూ.25 కోట్లుగా చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు చిన్నంశెట్టి రాజు లోక్ అదాలత్ని పర్యవేక్షించారు.
News September 13, 2025
విశాఖలో 15 రోజులపాటు HIV/AIDSపై అవగాహన

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 15 రోజులపాటు విశాఖ జిల్లా పాఠశాలల్లో విద్యార్థులకు HIV/AIDS, లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐఈసీ కాంపెయిన్ల ద్వారా జాగ్రత్తలు, చికిత్సా అవకాశాలు, గర్భిణులకు కౌన్సెలింగ్, హెల్ప్లైన్ 1097 సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.నాగేశ్వరరావు తెలిపారు.
News September 13, 2025
విశాఖ: బీజేపీ సభ ఏర్పాట్ల పరిశీలన

విశాఖ రైల్వే మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పరిశీలించారు. జేపీ నడ్డా హాజరవుతున్న ఈ సభకు మరి కొంతమంది ప్రముఖులు కూడా రానున్నారని వారు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తల సమీకరణ, స్వాగత ఫ్లెక్సీలను పరిశీలించారు. సభకు దాదాపు 20,000 మంది హాజరవుతారని అంచనా.