News April 22, 2025

అనకాపల్లి: ‘ఆధునిక సాంకేతికతను వినియోగించాలి’

image

నేరాలు నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. రేంజ్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ సమీక్షలో అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా పాల్గొన్నారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ప్రజలు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News April 23, 2025

అనంతపురం జిల్లాలో ఉద్యోగాలు.!

image

అనంతపురం జిల్లా శింగనమల KGBVలో ఖాళీ పోస్టులకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. KGBVలోని టైప్-3 హస్టల్‌లో ఉన్న ఖాళీలను MEO నరసింహ రాజు వివరించారు. KGBV-3లో హెడ్ కుక్-1 పోస్ట్, అసిస్టెంట్ కుక్-3 పోస్టులు, వాచ్‌మెన్-1 ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా టైప్‌-4లో చౌకీదార్-1, హెడ్ కుక్-1, అసిస్టెంట్ కుక్-1 ఖాళీగా ఉన్నాయి. ఈనెల 30లోగా మహిళలు ఈ పోస్టులకు శింగనమల MEO కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 23, 2025

జమ్మూకశ్మీర్‌లో HIGH ALERT

image

ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరోసారి దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతను పెంచారు. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.

News April 23, 2025

మంత్రిని కలిసిన పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు

image

పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలో ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణలో భాగంగా నిరవధిక సమ్మె రోజురోజుకు ఉద్ధృతంగా నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పరిధిలోని ఉన్న అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!