News March 28, 2025

అనకాపల్లి: ఆనాటి కాకతాంబ.. నేడు నూకాంబిక

image

అనకాపల్లిలో 1450లో నూకాంబిక అమ్మవారు మొదట కాకతాంబగా కొలువైంది. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలరాజు కాకతాంబ గుడిని నిర్మించారు. తర్వాత విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబిక అమ్మవారుగా మార్చారు. 1935లో నూకాంబిక అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. అప్పటినుంచి ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రతి ఏటా కొత్త అమావాస్య నుంచి నెలరోజులపాటు జాతర జరుగుతుంది.

Similar News

News November 19, 2025

కృష్ణా: నేడే రైతుల ఎకౌంట్లలో రూ.7వేలు జమ

image

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు నగదు నేడు జమకానుంది. జిల్లాలో 1,33,856 మంది రైతుల ఖాతాల్లో రూ.88.49కోట్లను 2వ విడత సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.66.93కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.21.56కోట్లు జమ కానున్నాయి. తొలి విడత సాయాన్ని గత ఆగస్ట్ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

News November 19, 2025

మంచిర్యాల: ప్రయాణికుల కోసం దర్భాంగ ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి-దర్భాంగ మధ్య ప్రత్యేక రైలు (07999)ను బుధవారం నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. ఇది రామగుండం, మంచిర్యాల, చిల్పూర్, కాగజ్‌నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్‌పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

News November 19, 2025

వరంగల్: సూరీడూ.. జల్దీ రావయ్యా..!

image

ఉమ్మడి వరంగల్‌లో చలి పెరిగిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లలోని విద్యార్థులు చలికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు హాస్టళ్లు ఊరి చివర్లో ఉండటంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో ఉదయమే ఎండ కోసం తపిస్తున్నారు. సూర్యుడు రాగానే విద్యార్థులంతా బయటకు వచ్చి ఎండలో నిలబడుతున్నారు. దీంతో ఎండతో పాటు విటమిన్-డి సైతం లభిస్తుంది. పర్వతగిరిలోని KGBV హాస్టల్ విద్యార్థులు ఉదయం వేళలో ఇలా ఎండలో నిలబడుతున్నారు.