News January 31, 2025
అనకాపల్లి: ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ..!

ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో ప్రధానంగా ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, కోరెడ్ల విజయ్ గౌరి మధ్య పోటీ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పీఆర్టీయు తరఫున శ్రీనివాసులు నాయుడు, ఏపీటీఎఫ్ తరపున రఘువర్మ, పీడీఎఫ్ నుంచి విజయగౌరి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాగా.. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి మద్ధుతిస్తాయో చూడాలి.
Similar News
News April 14, 2026
పిల్లులు సగం ఆహారమే ఎందుకు తింటాయి?

సాధారణంగా పెంపుడు పిల్లులు పెట్టిన ఆహారంలో సగమే తిని మిగతాది వదిలేస్తుంటాయి. ఇందుకు కారణం ఆ ఆహారం తాలూకు వాసన వాటికి బోర్ కొట్టడమేనని పరిశోధనల్లో తేలింది. ఎంత మంచి ఆహారం అయినా సరే రోజూ అదే పెడితే పిల్లులు క్రమంగా దాన్ని తినడం తగ్గించేస్తాయట. వేర్వేరు రకాల ఆహారం పెడుతూ ఉంటే అవి తినేందుకు ఆసక్తి చూపిస్తాయని.. ఆకలి కంటే కూడా వాసనకే ప్రాధాన్యం ఇస్తాయని రీసెర్చ్ పేర్కొంది.
News April 14, 2026
అనంతపురంలో భార్య గొంతు కోసిన భర్త..!

తాళి కట్టిన భర్త భార్య గొంతును కోసిన ఘటన అనంతపురంలో మంగళవారం చోటుచేసుకుంది. నగరంలోని సైఫుల్లా బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య గొంతు కోస్తున్న సమయంలో అడ్డువచ్చిన వ్యక్తిపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ప్రస్తుతం బాధితుణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య, రక్షకుడైన క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
News April 14, 2026
అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

మానవ తప్పిదాలు, ఇతర కారణాలతో జరిగే అగ్ని ప్రమాదాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. హనుమకొండ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫైర్ సర్వీస్ ఫ్లాగ్ ఆవిష్కరించి అమరులైన ఫైర్ సర్వీస్ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా గోడపత్రికల ఆవిష్కరించారు.


