News March 13, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 586 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 586 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి బి.సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 11,419 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 11,083 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 2,364 మంది హాజరు కావలసి ఉండగా 2,114 మంది హాజరైనట్లు తెలిపారు.
Similar News
News December 9, 2025
నకిలీ కాల్ సెంటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణరావు నకిలీ కాల్ సెంటర్ల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. తెలియని కస్టమర్ కేర్ నంబర్లను నమ్మవద్దని, అధికారిక వెబ్సైట్లలోనే వివరాలు చూడాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
News December 9, 2025
మంగళగిరి: సీకే హైస్కూల్ ఈసారైనా రాణిస్తుందా?

మంగళగిరిలో ఏళ్ల చరిత్ర కలిగిన CKహైస్కూల్ విద్యార్థులు ఈసారైనా టెన్త్ ఫలితాల్లో రాణిస్తారా అనేది వేచి చూడాలి. గతంలో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి మార్కులతో సత్తా చాటేవారు. కొన్నేళ్లుగా ర్యాంకుల సంగతి అటుంచితే ఉత్తీర్ణత శాతమే భారీగా పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం విద్యాశాఖ అమలు చేస్తున్న 100రోజుల ప్రణాళికను టీచర్లు పటిష్ఠంగా అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
News December 9, 2025
మంచిర్యాలలో విషాదం

మంచిర్యాలలోని ఏసీసీ సిమెంట్ కంపెనీ సమీపంలో సోమవారం రాత్రి రైలు కింద పడి సాగె శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన శ్రీనివాస్ ఏసీసీలో ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. పిల్లలు పుట్టడం లేదని బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ తెలిపారు.


