News March 13, 2025

అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 586 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 586 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి బి.సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 11,419 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 11,083 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 2,364 మంది హాజరు కావలసి ఉండగా 2,114 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News March 17, 2025

ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు నిల్..!

image

ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోయారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు, ప్యాన్లు లేవన్నారు. మూత్రశాలలు సైతం కంపుకోడుతున్నాయని చెబుతున్నారు. బస్టాండ్ అవరణలో ఉన్న షాపుల వారు ఉన్న రేట్లకంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు.

News March 17, 2025

అన్నమయ్య: ఒకవైపు తండ్రి మృతి.. మరో వైపు 10th పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. పీటీఎం మండలం గొడుగువారిపల్లెకు చెందిన వెంకటరమణ(55)కు ఇద్దరు పిల్లలు ఉండగా, భార్య వదిలేసింది. కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించేవాడు. ఆదివారం చింతకాయలు కోయడానికి చెట్టుఎక్కి కింద పడి మృతి చెందాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కాగా నేడు వెంకటరమణ కుమార్తె పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News March 17, 2025

నిర్మల్ జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అర్హులైన గిరిజన నిరుద్యోగులు tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

error: Content is protected !!