News March 12, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్షలకు 325 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 325 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి మొత్తం 12,481 విద్యార్థులకు గాను 12,156 మంది హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
సమస్యలపై ఎర్రజెండా పార్టీలతో కలిసి పోరాటం: కవిత

ఖమ్మం: రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా పార్టీలతో కలిసి పోరాటం చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలు పెంచుతున్నప్పటికీ పూర్తి కావడం లేదని తెలిపారు.

హిడ్మా మృతదేహం (photo)

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు <<18318593>>హిడ్మా<<>> ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతం కాగా ఆయన మృతదేహం ఫొటో బయటకు వచ్చింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.