News April 14, 2025
అనకాపల్లి: ఇద్దరి మృతదేహాలు లభ్యం

దేవరాపల్లి సమీపంలోని సరియా జలపాతంలో ఆదివారం గల్లంతయిన ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. ఏపీ ఎస్.డి.ఆర్.ఎఫ్ బృంద సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. స్నేహితులతో కలిసి విహారానికి వచ్చి పూర్ణ మార్కెట్‌కి చెందిన నరసింహం (23), వాసు (25) జలపాతంలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందారు. అనంతగిరి ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 20, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూల్ జిల్లా TDP నాయకుడు సురేంద్ర మృతి
➤కర్నూలు: 3 శాతానికి పెరిగిన స్పోర్ట్స్ కోటా.!
➤రూపాయి నోటుపై సీఎం చంద్రబాబు చిత్రం
➤కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
➤కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
➤అనంత: బీటెక్ ఫలితాలు విడుదల
➤సురేంద్ర మృతి పార్టీకి తీరని లోటు: కర్నూలు MP
➤సీఎం బర్త్ డే.. ఎమ్మిగనూరులో 75 కేజీల కేక్ కటింగ్
➤కర్నూలు జిల్లాలో దంచికొట్టిన వర్షం
News April 20, 2025
IPL.. రికార్డు సృష్టించాడు

సీఎస్కే తరఫున బరిలోకి దిగిన యంగెస్ట్ ప్లేయర్‌గా ఆయుష్ మాత్రే(17y 278d) రికార్డు నెలకొల్పారు. ముంబైతో జరుగుతున్న మ్యాచులో మాత్రే అరంగేట్రం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో అభినవ్ ముకుంద్(18y 139d), అంకిత్ రాజ్ పుత్(19y 123d), పతిరణ(19y 148d), నూర్ అహ్మద్(20y 79d) ఉన్నారు. ఓవరాల్‌గా IPLలో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ(14y 23d) ఉన్నారు.
News April 20, 2025
మాజీ డీజీపీ దారుణ హత్య

కర్ణాటక మాజీ DGP ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారు. బెంగళూర్‌లోని ఆయన నివాసంలో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శరీరంలో పలు చోట్ల కత్తిపోట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయనను భార్యే చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి 2017 వరకూ కర్ణాటక డీజీపీగా ఓం ప్రకాశ్ పనిచేశారు.