News February 25, 2025
అనకాపల్లి: ‘ఈనెల 27న వారికి సెలవు’

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈనెల 27వ తేదీన ప్రత్యేక క్యాజువల్ లీవు మంజూరు చేస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 26, 27 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
Similar News
News November 6, 2025
సత్యసాయి బాబా సూక్తులు

● నీకు హాని చేసిన వారిని కూడా నువ్వు క్షమించాలి
● పరస్పర ప్రేమను అలవర్చుకోండి. ఎప్పుడూ ఆనందంగా, ముఖంపై మధురమైన చిరునవ్వుతో ఉండండి
● ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకు
● ఎలాంటి కష్టాలు వచ్చినా భగవంతుడిపై విశ్వాసం కోల్పోకూడదు, విశ్వాసం ఉంటే ఎంతైనా సాధించొచ్చు.
News November 6, 2025
NZB: మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

నవీపేట్(M) ఫతేనగర్ శివారులో అక్టోబర్ 24న జరిగిన <<18089668>>మహిళ హత్య<<>> కేసులో ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు NZB ACP రాజావెంకట్ రెడ్డి తెలిపారు. ఫకీరాబాద్, కోస్గీ, మద్దేపల్లికి చెందిన సంగీత, మంగలి బాబు, పద్మ.. మృతురాలు శ్యామల లక్ష్మీ @ బుజ్జిని ఫతేనగర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశారు. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. డబ్బుల కోసం వారి మధ్య గొడవ జరిగిందని ACP వెల్లడించారు.
News November 6, 2025
SRP: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు శిబిరాలు

సింగరేణిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నవంబర్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీరాంపూర్, 17, 18 తేదీల్లో మందమర్రి, 24, 25 తేదీల్లో బెల్లంపల్లి, గోలేటి ఏరియాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశాన్ని సీఎంపీఎస్, సీపీఆర్ఎంఎస్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.


